Header Banner

హీరో సందీప్ కిషన్ సంచలన కామెంట్!ఆ వ్యాధితో బాదపడుతున్నానని స్వయంగా వెల్లడించాడు!

  Fri Feb 21, 2025 10:36        Cinemas

సందీప్ కిషన్.. సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ కుర్ర హీరో.. హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేశాడు సందీప్. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు సందీప్ కిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. గౌతమ్ మీనన్ దగ్గర సందీప్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు.


యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా. సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతూ ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. త్రినాద్ రావు సినిమాలు అం తే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. సినిమా చూపిస్తా మామ ధమాకా , నేను లోకల్ , హలొ గురు ప్రేమకోసమే లాంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆకట్టుకునే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సందీప్ గురించి మాట్లాడుకుంటే.. ఎన్నో సూపర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ యంగ్ హీరో.. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సందీప్.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 
 
మొదటి సినిమా ప్రస్థానం దగ్గర నుంచి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా ఊరుపేరు భైరవకోన సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సందీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఓ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపాడు. తాను సైనస్ తో బాధపడుతున్నట్టు తెలిపాడు.

సినిమా షూటింగ్ లో గ్యాప్ లో కార్ వ్యాన్ లోకి వెళ్లి నిద్రపోతాను అని చెప్పాడు. పడుకున్న తర్వాత నా ముక్కునుంచి తన వెనక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు. అలాగే ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను. మా అమ్మానాన్నతో కూడా నేను మాట్లాడనూ.. ఉదయాన్నే వేడిగా టీ తాగి, మెడిటేషన్ మ్యూజిక్, స్తోత్రాలు విని ఆతర్వాత మాట్లాడతా అని చెప్పాడు. అలాగే దీని కోసం సర్జరీ చేయించుకోవాలి.. ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదు అని సందీప్ తెలిపాడు. అలాగే నెలరోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి, ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #hyderabad #sandeep #health #entrertainement #movies